flop hero
flop hero: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం కింగ్‌డమ్

Flop Hero Record: ప్లాఫ్ హీరోకు యూట్యూబ్ లో ఈ రేంజ్ వ్యూసా?

Flop Hero Record: విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్‌డమ్(Kingdom) టీజర్ రెండు రోజుల క్రితం యూట్యూబ్ లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది. వరుస అపజయాల తర్వాత విజయ్ దేవరకొండ నుంచి ఈ రేంజ్ సాలిడ్ కంటెంట్ వస్తుందని అభిమానులు కూడా గెస్ చేయలేదు. మేకింగ్ పరంగా చాలా రిచ్ ఉంది. సినిమా లో మంచి కంటెంట్ ఉందనేది టీజర్ తో ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చారు.

విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాడనేది ఆడియన్స్‌ ఒక అంచానకు వచ్చారు. ఈ టీజర్ ఇంత హైలైట్ కావడానికి ప్రధాన కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger Ntr) వాయిస్ ఓవర్. ‘దేవర’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి విడుదలైన వాయిస్ ఓవర్ కావడంతో ఆయన అభిమానులు కూడా ఈ టీజర్ ను ఆసక్తిగా చూశారు. దీంతో అటు విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మంచి ప్రమోషన్ అయితే చేశారు.

ఇక ఈ టీజర్ 24 గంటల్లో పదకొండు మిలియన్లకు పైగా వీక్షణలు అందుకొని మీడియం రేంజ్ హీరోల్లో ఆల్ టైం రికార్డు నమోదైందని చెబుతున్నారు. అలాగే దాదాపు 3 లక్షల 30 వేల దాకా లైక్స్ కూడా వచ్చాయి. ఇది కూడా ఓ రికార్డే. టీజర్ కు యాడ్స్ ద్వారా కొంత వ్యూస్ కలిసొచ్చాయని భావించవచ్చు. కానీ లైక్స్ ఈ స్థాయిలో వచ్చాయంటే, కచ్చితంగా ఈ టీజర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ టీజర్ తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో ఆరు మిలియన్లకు పైగా వీక్షణలు, 75 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ లైక్స్ ని బట్టి చూస్తే అక్కడ కూడా ఈ టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చిందంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక హిందీ వెర్షన్ కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ మరింత ప్లస్ అయ్యింది.

తమిళ్‌లో ఈ టీజర్ కి కేవలం 24 గంటల్లో నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 54 వేలకు పైగా లైకులు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) వాయిస్ ఓవర్ కారణంగా ఆయన అభిమానులు ఈ తమిళ వెర్షన్‌కు ప్రమోషన్స్ బాగా చేశారు. మొత్తంగా ఈ టీజర్‌ మూడు భాషలకు కలిపి 22 మిలియన్లకు పైగా వీక్షణలు అందుకుంది. ఇది మీడియం రేంజ్ హీరోల కేటగిరీలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొత్తంగా చూస్తే పాన్ ఇండియా స్థాయిలో మే 30వ తేదీన విడుదల కానున్నది. ఈ సినిమాకి మంచి వసూళ్లు అందుకుంటుందని, టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియన్ స్టార్ గా నిలుస్తాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *