- స్టోరీ సెలెక్షన్ లో పూర్
- ఐదు సూపర్ హిట్లు వదులుకున్న టాలీవుడ్ హీరో
Star Hero: కొందరు దర్శకులు, రచయితలు తాము కథ రాసుకునేటప్పుడు ఓ హీరోను అనుకొని స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటుంటారు. దర్శక రచయితలు స్టోరీని సదరు హీరోకు నరేట్ చేస్తారు. అయితే కథ సదరు హీరోకు నచ్చకపోవడమో, లేదా బడ్జెట్ పరంగా నిర్మాతకు వర్కౌట్ కాకపోడం మూలంగా అవి వేరే హీరోకు వెళ్లడమో లేదా, మూలన పడడమో జరుగుతుంటాయి. ఈ ప్రక్రియ అన్ని భాషల్లో కామనే. అయితే టాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరో కథ రిజెక్ట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్టవుతుందని ఓ రూమర్ క్రియేట్ అయ్యింది. మరి ఆ రూమర్ ఏంటి? ఆ హీరో ఎవరో తెలుసుకుందాం.
ఫ్లాపుల్లో రౌడీ స్టార్
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఈ రౌడీ స్టార్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తున్నది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని టాలీవుడ్ టాక్ వినిపిస్తుంది. గతేడాది ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ రౌడీ హీరో మధ్యలో కొన్ని భారీ డిజాస్టర్స్ మూటగట్టుకున్నాడు. గీత గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరినా ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాలు అందుకోలేక సతమతమవుతున్నాడు.

స్టోరీ సెలెక్షన్ లో పూర్..
స్టోరీ సెలెక్షన్ లో విజయ్ తడబడుతున్నాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయ్ తిరస్కరించిన సినిమాలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా ముందు విజయ్ దగ్గరకే వెళ్లింది. కానీ కథ నచ్చలేదని రిజెక్ట్ చేశారు. అప్పటి వరకు ప్లాఫుల్లో నితిన్ ఈ సినిమాతో సక్సెస్ కొట్టాడు. నితిన్ కెరీర్ కు ఈ విజయం కాస్త ఊరటనిచ్చింది.

ఆర్ఎక్స్ 100 సినిమా కథ కూడా దర్శకుడు అజయ్ భూపతి ముందు విజయ్ కే వినిపించాడు. కొంత నెగెటివ్ క్యారెక్టరైజేషన్ ఉండంతో ఈ సినిమాను వదులుకున్నాడు. రూ.2 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా రూ.25 కోట్లు రాబట్టి టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. తొలి చిత్రం ఉప్పెనతో భారీ హిట్టు కొట్టిన బుచ్చిబాబు సానా ముందుకు ఈ సినిమా కథను విజయ్ కే చెప్పాడు. సినిమా క్లైమాక్స్ నచ్చలేదని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఉప్పెనతో హీరోగా పరిచయమైన పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతో భారీ హిట్టు కొట్టి వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇలా మూడు హిట్లను వదులుకున్నాడు రౌడీ స్టార్..
పూరీని నమ్మకుంటే హిట్టు.. నమ్మితే ఫట్టు..
ఇక ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సినిమా అటు దర్శకుడు పూరీ జగన్నా్థ్ (Puri Jagannath) ను, ఇటు హీరో రామ్ పోతినేనికి తిరుగులేని సక్సెస్ ను ఇచ్చింది. తెలంగాణ యాసకు విజయ్ దేవరకొండ అయితే సూటవుతాడని భావించిన పూరీ ముందు ఈ కథను రౌడీ స్టార్ కే చెప్పాడు. గీత గోవిందం సినిమా చిత్రీకరణ సమయంలో విజయ్ టైమ్ తీసుకొని మరీ ఈ కథ చెప్పాడు. అప్పుడు ప్లాఫుల్లో ఉన్న పూరీని విజయ్ నమ్మలేదు. పూరీ ఇక లాభం లేదనుకొని ప్లాఫుల్లో రామ్ పోతినేనితో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఒక్క దెబ్బతో ఇద్దరి కెరీర్ లు గాడిన పడ్డాయి. ఆ తర్వాత విజయ్ పూరీని నమ్మి పాన్ ఇండియా లెవెల్లో లైగర్ సినిమాతో తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ తో ఆ ఇద్దరినీ కోలుకోలేని దెబ్బతీసింది.

ఇక సాఫ్ట్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) సీతారామం (SeethaRamam) సినిమాను ముందు విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నాడు. కానీ లైగర్ ప్రాజెక్టులో బిజీగా ఉండడంతో ఆ సినిమాను వదులుకున్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ సేన్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఐదు భారీ హిట్లను వదులుకున్నాడు రౌడీ స్టార్. ఇలా బయటికి రానివి ఇంకెన్ని ఉన్నాయో.