10TH RESULTS : 10 వార్షిక పరీక్షల ఫలితాలలో మంచిర్యాల మోడల్ స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ప్రైవేటుకు దీటుగా నిలిచారు. మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ మోడల్ స్కూల్ (MODEL SCHOOL) విద్యార్థులు పది వార్షిక పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు నల్ల చరణ్ 571 మార్కులు, దుర్గం నక్షత్ర 566 మార్కులు, కోడూరి ఆరాధ్య 563 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలకు దీటుగా రాణించారు. విద్యార్థులను కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల విద్యాశాఖ అధికారి యాదయ్యతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :