OPENING
సైన్స్ ఎక్స్ ఫోను ప్రారంభిస్తున్న ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావు, డీఆర్ ఢీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, కలెక్టర్ కుమార్ దీపక్

SPACE & DEFENCE EXPO : అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి….

  • ‌సాంకేతిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలి
  • మంచిర్యాల ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావు

SPACE & DEFENCE EXPO : విద్యార్థులకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు పట్టుదల, ఏకాగ్రతతో చదువుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేం సాగర్ రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీ ఉషోదయ ఉన్నత పాఠశాల మైదానంలో కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ (కెఐవైఈ), యార్లగడ్డ అభిరామ్ మెమోరియల్ గ్రామ సేవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్ స్పైర్ ఇండియా-2025 స్సేస్, డిఫెన్స్ ఎక్స్ ఫో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డీఓ) మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎన్.ఆర్.ఎస్.సి. శివ శంకర్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

TALKING
మాట్లాడుతున్న ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావు,

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడంతో పాటు దేశ రక్షణలోనూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని, ఇందు కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా స్పేస్ అండ్ డిఫెన్స్ ఇన్స్ ఫో సంయుక్తంగా మంచిర్యాలలో కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇస్రో, సాంకేతికత రంగంలో చెందుతున్న అభివృద్ధి, స్పేస్ లో మారుతున్న పరిణామాలపై విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శన ఏర్పాటు చేయడం విద్యార్థుల అదృష్టమని, ఈ అవకాశాన్ని వినియోగంచుకొని విజ్ఞానాన్ని పొందవచ్చన్నారు. ఆసక్తి గల విద్యార్థులు భవిష్యత్తులో స్పేస్ అండ్ డిఫెన్స్ రంగాలను ఎంచుకొని దేశ రక్షణలో పాలు పంచుకునేందుకు ఇది మంచి అవకాశమని అన్నారు.

EXPLAIN
విద్యార్థులకు వివరిస్తున్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బుచ్చన్న

అలరించిన ప్రదర్శనలు
ఇన్ స్పైర్ ఇండియా 2025 ఎక్స్ ఫోలో ఇస్రో, డీఆర్ డీఓ నుంచి తీసుకువచ్చిన సాంకేతిక, రక్షణ విభాగానికి సంబంధించిన నమూనాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ఐదు వేల మందికి పైగా విద్యార్థులు ఈ ఎక్స్ ఫోకు హాజరై నమూనాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, కేఐవైఈ ఫౌండర్ నరేష్, యార్లగడ్డ అభిరామ్ మెమోరియల్ గ్రామ సేవ ఫౌండర్, శ్రీ ఉషోదయ పాఠశాల ప్రిన్సిపాల్ యార్లగడ్డ బాలాజీ, అసోసియేటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, ట్రస్మా నాయకులు రాపోలు విష్ణు వర్ధన్ రావు, ఉదారి చంద్రమోహన్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, దుర్గా ప్రసాద్, జాన్ థామస్, ప్రవీణ్, గోనె భాగ్యలక్ష్మి, శరత్, లక్ష్మణ్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *