- జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్
ADDITIONAL COLLECTOR : జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్ కుమార్ రైస్ మిలర్లకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎంఆర్ సరఫరాపై సంబంధిత శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మిల్లర్ తమ బాధ్యతగా సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లర్ల వారీగా నిర్ధేశించిన లక్ష్యం, పూర్తిచేసిన సరఫరా, నిల్వ ఉన్న ధాన్యం, రోజువారి తరలింపు వివరాలను సమీక్షించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ కిరణ్ కుమార్, సివిల్ సప్లయిస్ డీఎం వేణుగోపాల్, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల / బాసర :