BURNING IN EFFIGY : కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధ వారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, ఇప్టు జిల్లా అధ్యక్షులు బ్రహ్మనందంలతో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇప్పటికైన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని, పెరుగుతున్న నిత్యవసర సరుకుల అధిక తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఖలిందర్ ఆలీ ఖాన్, మిట్టపల్లి పౌలు, రాయమల్లు, మహేష్, సిఐటియు నాయకులు ప్రకాష్, సాయి తేజ, సాగర్, ఇఫ్టు నాయకులు ఎండి జాఫర్, రాజేశం, సురేందర్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :