Attacks on Forest officers
Attacks on Forest officers

Attacks on Forest: కారంపొడి చల్లి.. పరుగెత్తించి..

  • ఫారెస్ట్ సిబ్బందిపై దాడి
  • తాళ్లపేట్ రేంజ్ లింగాపూర్ బీట్ పరిధిలో ఉదంతం

Attacks on Forest: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట్ రేంజ్ లింగాపూర్ బీట్ పరిధిలో అడవి సిబ్బందిపై ఆక్రమణదారులు ప్రణాళికాబద్ధంగా దాడి చేశారు. దమ్మనపేట, మామిడిగూడ గ్రామాలకు చెందిన ఆక్రమణదారులు కత్తులు, గొడ్డళ్లు, కర్రలతో విరుచుకుపడి ముగ్గురు సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు.

ఈ దాడిలో ఎఫ్‌ఎస్‌ఓ బాలకృష్ణ, ఎఫ్‌బీవో పరమేశ్వర్, బేస్ క్యాంప్ వాచర్ రాజేందర్ గాయపడ్డారు. కళ్లలో మిరప పొడి చల్లి, తరుముతూ చంపేస్తామని బెదిరించినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడి పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగి ప్రాణహానికే ఉద్దేశించిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై దండేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అడవి అధికారులు డిమాండ్ చేశారు. దాడి ఫొటోలను కూడా పోలీసులకు అందజేశారు.

Attacks on Forest officers
Attacks on Forest officers

అటవీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగింది

  • తాడ్లపేట అటవీ రేంజ్ అధికారి వి. సుష్మ

జిల్లాలో తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో అటవీ సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని తాళ్లపేట అటవీ రేంజ్ అధికారి వి. సుష్మ ఒక ప్రకటనలో తెలిపారు. లింగాపూర్ బీట్, తాళ్లపేట రేంజ్ లో దండేపల్లి మండలం దమ్మన్నపేట, మామిడిగూడ ప్రాంతాల ఆక్రమణదారులు ప్రణాళికబద్ధంగా అటవీ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు.విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ ఎస్ వో) బాలకృష్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్ బిఓ) పరమేశ్వర్, బేస్ క్యాంప్ వాచర్ రాజేందర్ లపై కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి మిర్చి పొడిని అటవీ సిబ్బంది కళ్ళపై బలవంతంగా రుద్దారని తెలిపారు. సిబ్బందిపై దాడి చేసే సమయంలో గుంపుగా వెంబడించారని, స్పష్టంగా ముందస్తు ప్రణాళికతో హింసాత్మక చర్యకు పాల్పడి సిబ్బందికి గాయాలు చేశారని తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిపై దండేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల(దండేపల్లి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *