Bandi Sanjay: ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొప్పతనాన్ని ప్రతిబింబించే “వైభవ గీతం” పోస్టర్‌ను కేంద్రమంత్రి బండి సంజయ్ శనివారం కరీంనగర్లో ఆవిష్కరించారు. ఈ గీతాన్ని సినీ గేయ రచయిత గుండేటి రమేష్ రచన, గానం, దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా గుండేటి రమేష్ మాట్లాడుతూ, ఈనెల 19 నుంచి గీతం షూటింగ్ ప్రారంభమవుతుందని, ఆగస్టు 2న గుండేటి మ్యూజిక్, మూవీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆల్బమ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో తెలంగాణ యువజన సంఘాల సమితి, బీజేపీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, మాజీ కార్పొరేటర్ బండ రమణ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, కరీంనగర్ :