Gorintaku Festival: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెహర్‌నగర్ వింధ్యావ్యాలీ ఉన్నత పాఠశాలలో శనివారం గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ రామవరం లక్ష్మీ ప్రకాష్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తుందన్నారు. ఇది శరీరంలోని వేడిని తగ్గించే గుణం కలిగి ఉంటుందని చెప్పారు. అలాగే, గోరింటాకు రోగనిరోధక శక్తిని పెంపొందించి, రక్త ప్రసరణను మెరుగుపరచే లక్షణాలు ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల తల్లులకు విద్యార్థినులు గోరింటాకును పెట్టి సాంప్రదాయాన్ని పాటించారు. తల్లులు గోరింటాకుతో ఉత్సాహంగా ఆటలాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ R. పృథ్వీరావు, ప్రిన్సిపాల్ G. ప్రశాంత్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, కరీంనగర్: