మందల గోకుల్ రెడ్డి ఉదారత
Fees Donation: పెద్దపల్లిలోని ట్రినిటీ సీబీఎస్ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పులి అభిరామ్‌కు 1,20,000 రూపాయల ఫీజును పెద్దపల్లి జిల్లా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మందల గోకుల్ రెడ్డి చెల్లించారు.
మంచి విద్య అందించాలనే సంకల్పంతో విరాళం అందించిన గోకుల్ రెడ్డికి విద్యార్థి తండ్రి విజయ్ కుమార్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ట్రినిటీ సీబీఎస్ఈ స్కూల్ ప్రిన్సిపాల్, యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు, ట్రస్ట్ ట్రెజరర్ మేకల మల్లేశం యాదవ్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలారపు పర్వతాల యాదవ్, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెత్తుల నాగరాజ్ యాదవ్ పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, పెద్దపల్లి :