Swamy Vikekananda : జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి చక్రపాణి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు కేరళలో జరిగే నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపునకు ఇటీవల ఎంపికైన బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థిని అమరగొండ అజయ్ ని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేందర్ రెడ్డి, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఏం కుమారస్వామి, డాక్టర్ కే రాజయ్య, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల