BJP CELEBRATIONS : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) విజయాన్ని పురష్కరించుకొని ఆది వారం చెన్నూర్ నియోజక వర్గంలోని కోటపల్లి మండలంలో నాయకులు సంబురాలు (CELEBRATIONS) జరుపుకున్నారు. బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు (SWEETS) పంచి పెట్టారు. అనంతరం కోటపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మంత్రి రామన్న, జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ దుర్గం అశోక్ లు మాట్లాడుతూ తెలంగాణలో కూడా బిజెపి అధికారం లోకి రావడం ఖాయమని, పీఎం (PM) నరేంద్ర మోడీ, అమీత్ షా, జేపీ నడ్డ నాయకత్వంలో దేశంలో బిజెపి అభివృద్ధి పథంలో దూసుకువెళుతుందన్నారు.
రానున్న స్థానిక సంస్థలలోను ఇదే ఊపు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంబురాలలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు వడ్లకొండ రాజేష్, జనరల్ సెక్రెటరీ కందుల వెంకటేష్, గిరిజన మోర్చా అధ్యక్షులు కొడిపె మహేష్, బూత్ అధ్యక్షులు కాసెట్టి రాకేష్, సీనియర్ నాయకులు దుర్గం నరసింహులు, సేగం చంద్రయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, కోటపల్లి (మంచిర్యాల) :