divakar rao
divakar rao : విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నడిపెల్లి దిావాకర్ రావు

Divakar Rao : ప్రజా పాలనా..? దౌర్జన్య పాలననా…?

  • నోటిఫికేషన్ లేకుండా అధికారులు ఎలా హాజరు అవుతారు…
  • వేంపల్లి వద్ద 2కోట్లకు ఎకరాకు ఉంది.. 550 కోట్ల విలువ ఉంది
  • దళితుల గొంతు కోస్తున్న ఎమ్మెల్యే పీఎస్సార్
  • రైతులను బెదిరిస్తూ భూములు లాక్కుంటున్న ప్రేమ్ సాగర్ రావు
  • రూ. 200 కోట్లు ఎమ్మెల్యేకు.. రూ. 13.5 లక్షలు రైతులకు
  • మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సంచల వ్యాఖ్యలు

Divakar Rao : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దళితుల గొంతుకోస్తున్నాడని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు విషయంలో పోచంపాడు గ్రామ శివారులోని వేంపల్లి, ముల్కల్లా, గ్రామాలకు చెందిన దళిత సోదరుల,బీసీ ల, భూములను తక్కువ ధర కు (13 లక్షల 50 వేల రూపాయలకు) ఎకరం చొప్పున నష్ట పరిహారం చెల్లించి అధికారులు,అధికార పార్టీ నాయకులు బెదిరించి వారి భూములను లాక్కున్నారని సంచలన ఆరోపణలు చేశారు. నోటిఫికేషన్ రాకముందే అధికారులు భూ సేకరణకు వెళ్లారని ఆరోపించారు. ఐదు నెలల క్రితం అధికారులు రైతుల నుంచి సంతకాలు తీసుకున్నారని విమర్శించారు. బలవంతంగా భూమును లాక్కోవడం ప్రజా పాలనా..? అని ప్రశ్నించారు. దౌర్జన్యంగా భూములు లాక్కోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

రైతులకు (నష్టపరిహారం) న్యాయంగా డబ్బులు చెల్లించి, ఆ స్థలంలో ఇండస్ట్రియల్ పార్క్ చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ భయపెట్టి, బెదిరించి వాళ్ల దగ్గర నుంచి అన్యాయంగా భూములు గనుక తీసుకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దళిత,బీసీలకు అండగా ఉంటామని చెప్పారు. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ భూములు కొనుగోలు చేసిన వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకొని వాటిని మళ్లీ దళితులు, బీసీలకే అప్పగిస్తామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం అక్కడ భూమి విలువలో 30% డబ్బు ప్రభుత్వానికి కట్టి, మిగతా 70% శాతం డబ్బు,కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చి మీరు భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మీరు కట్టిన డబ్బులు తిరిగి రావని కొనుగోలు దారులను హెచ్చరించారు. ఇప్పుడు మీరు తక్కువ ధరకు కొనుగోలు చేసినా భవిష్యత్ లో ఆ భూమి ని దళిత, బీసీలకు అప్పగించాల్సి వస్తుందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఆ భూమికి ఎంత రేటు ఉంటుందో అంత రేటు అక్కడ కొన్న వారే దళిత, బీసీ లకు చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అప్పుడు నా మద్దతు కూడా పూర్తిగా వాళ్లకే ఉంటుందన్నారు. ఒకవేళ ఇప్పుడు కొన్నవాళ్లు డబ్బు చెల్లించకపోతే ఆ భూమిని దళిత, బీసీలు ఆక్రమించుకుంటారన్నారు. వారికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసులు, వివిధ శాఖల అధికారులు పూర్తిగా అండగా ఉంటారని చెప్పారు. అన్యాయానికి కొమ్ముగాసి, పేదవాళ్లను రోడ్డున పడేసి, అక్కడ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలనుకోవడం సరికాదన్నారు.

divakar rao press meet
divakar rao press meet

ఇప్పుడు ముల్కల్ల, వేంపల్లి గ్రామాలకు సంబంధించిన భూమి కోల్పోతున్న రైతులు, ఇప్పుడు  బాండు పేపర్ మీద రాసి ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల అండతో తమను బెదిరించి భూములు తీసుకుంటున్నారని, న్యాయం చేయాలని కోరుతున్నారని చెప్పారు .ఇష్టం లేకున్నా భయంతోనే తాము ఈ భూములు ఇచ్చి డబ్బులు తీసుకున్నామని తమ దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. భయభ్రాంతులకు గురై ఒప్పుకున్నట్ల తనతో చెప్పారన్నారు. భవిష్యత్తులో మాకు న్యాయం చేయాలని అనేక మంది కోరుతున్నారని తెలిపారు.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ భూమి కొందాం అనుకుంటున్న ప్రతి వ్యక్తి ఒకటికి, పది సార్లు ఆలోచించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత, బీసీ రైతులకు భూమి యజమానులకు న్యాయం జరిగేంత వరకు మా సహకారం ఉంటుందనే అనే విషయాన్ని మరొక్కసారి సూటిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాని దివాకర్ రావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్, పట్టణ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *