Financial Assistance : తమ తోటి ఆటో డ్రైవర్ కుటుంబానికి సాయం అందించి ఉదాతర చాటుకున్నారు ఆటో డ్రైవర్లు. మంగపేట మండలం రమణక్కపేటలో ఆటో డ్రైవర్ తెల సాంబయ్య తల్లి రమణ (45) ఇటీవల అనారోగ్యంతో చనిపోయింది. ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని తోటి ఆటో డ్రైవర్లు పరామర్శించారు. రాజుపేట శ్రీ చైతన్య ఆటో యూనియన్ తరపున రూ. 5600 అందజేశారు. కార్య క్రమంలో రాజుపేట శ్రీ చైతన్య ఆటో యూనియన్ డ్రైవర్లు పాల్గొ న్నారు.
– శెనార్తి మీడియా, మంగపేట