Cotton Fight
Cotton Fight : ధర్నా చేస్తున్న పత్తి రైతులు

Cotton Fight:చెన్నూరులో పత్తి రైతుల పోరు

  • మద్దతు మాటల్లోనే, మా గోడు ఎవరు వింటారు..?

Cotton Fight: మంచిర్యాల జిల్లా చెన్నూరు రైతన్నల గోసకు అంతు లేకుండా పోతున్నది. ”మా పంట కొనండి మహాప్రభో” అంటూ విన్నవించినా, అధికారుల నిర్లక్ష్యానికి బతుకుపోరాటం చేస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి విన్నవించుకున్నా, ఎన్ని హామీలు ఇచ్చినా, చివరికి మళ్లీ రోడ్డెక్కాల్సిందేనా? సోమవారం పత్తి రైతులు ఆందోళన చేపట్టి, తమ ఆగ్రహాన్ని ఉగ్రరూపంలో వ్యక్తం చేశారు.

అధికారుల తీరుతో పత్తి రైతుల కడుపు మండిపోతోంది
ఒక్కసారి వాహనాల్లో మిల్లులకు వెళ్లిన రైతులు, అక్కడే రోజులు గడిపి వెనక్కి తిరిగి రావాల్సిన దుస్థితి. నష్టం అంతా రైతులదే. వాహనాల కిరాయి పెరిగిపోతోంది, పత్తి నిల్వలు పెరిగిపోతున్నాయి, కానీ కొనుగోలు మాత్రం ఆగిపోయింది. సీసీఐ అధికారులు మిల్లర్లతో చేతులు కలిపి వ్యవహరిస్తున్నారని రైతులు కుండబద్ధలు కొట్టారు. నాయకులు నాపైనేనా..? మిల్లుదారుల పైనేనా..? అంటూ ప్రభుత్వ పెద్దల వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు.

మద్దతు మాటల్లోనే, భరోసా మాయ

నాయకులు పదేపదే హామీలు ఇస్తున్నారు, కానీ రైతన్న గుండె చీల్చే నిజం ఏంటంటే – మా గోడును పట్టించుకునే ఒక్కరు లేరు… హామీలు విన్నాం, మద్దతు మాటలు విన్నాం, కానీ రైతుల కష్టాలు తీరే చాన్స్ కనిపించడం లేదు. ప్రతి సారి ఇదే హడావిడి, కానీ సమస్య మారదే అంటూ రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనతో కదిలిన అధికారులు – అయినా అదే డ్రామా

పట్టాభద్రుల్లా కూర్చున్న అధికారులు రైతుల పోరాటంతో చివరికి సంఘటనా స్థలానికి చేరుకుని, తప్పకుండా కొనుగోలు ప్రారంభిస్తాం అంటూ లైట్ హామీలు ఇచ్చారు. ఇదే మాటలు గతంలో కూడా విన్నాం, మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారా..? అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ స్థితి మారాలంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు చేతుల్లోకి దిగాలి. అధికారుల నిర్లక్ష్యాన్ని తుడిచిపెట్టాలి. లేని పక్షంలో, రైతుల ఆగ్రహం మరింత తీవ్రరూపం దాల్చడం ఖాయం.

 

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *