Joinings in BJP: గన్నేరువరం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరారు. గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.
గన్నేరువరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుల్లెల జగన్, బీఆర్ఎస్ పార్టీ కి చెందిన సోషల్ మీడియా మండల కన్వీనర్ జిల్ల కుమార్ యాదవ్ , బీఆర్ఎస్ నాయకుడు మునిగంటి లింగయ్య బుధవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పలువురు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు మండల అధ్యక్షుడు నికేష్ తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, పుల్లెల రాములు, స్థానిక నాయకులు ఉన్నారు.
-శెనార్తి, మీడియా, గన్నేరువరం
