- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
MLA PSR : కస్తూర్బా వసతి గృహాల్లో మెస్, కాస్మొటిక్స్ చార్జీల పెంపు తన సూచనతోనే జరిగిందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. ఆది వారం ఐబీలో జరుగుతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మార్చి 8న రాజీవ్ నగర్ కస్తూర్బా పాఠశాల సందర్శనలో విద్యార్థులు తన దృష్టికి సమస్యలు తీసుకురాగా వెంటనే సంబంధిత మంత్రికి వివరించానని తెలిపారు. స్పందించిన మంత్రి మార్చి 20న పెంపును అధికారికంగా అమలు చేసినట్టు తెలిపారు.
అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట
మంచిర్యాల ఐబీలో ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావు వెల్లడించారు. మహాప్రస్థానం ప్రారంభించామని, దీని ద్వారా నిరుపేదలకు ఉచిత అంత్యక్రియలు చేపట్టనున్నట్టు తెలిపారు. మరోవైపు మాతా-శిశు ఆసుపత్రి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, 2027లోపు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. విద్యను పటిష్ఠం చేయడం కోసం ప్రతి పాఠశాలకు సొంత భవనాలు, అవసరమైన వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :