MLA PSR
MLA PSR

MLA PSR : ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

MLA PSR : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను ఆది వారం మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులను, కాంట్రాక్టర్లనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. త్వరితగతిన పూర్తి చేసి సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ఈ ప్రభుత్వాసుపత్రి ద్వారా మూడు మండలాల ప్రజలకు ఉత్తమమైన సేవలందించే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులున్నారు.

‌- శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *