New Committe: తెలంగాణ ఎరుకల ప్రజా సమితి భూపాలపల్లి జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కేతిరి సారయ్య, అధ్యక్షుడిగా కెమసారం రాజు, ప్రధాన కార్యదర్శిగా రెవెల్లి సతీష్, ఉపాధ్యక్షులుగా కేతిరి కోటి, పాలకుర్తి ప్రభు, కుతాడి తిరుపతి, పాలకుర్తి వెంకటేష్, సహాయ కార్యదర్శులుగా కేతిరి సుధాకర్, కేతిరి రాజు కుమార్, పల్లకొండ సురేష్, కోశాధికారిగా కేతిరి కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి నియామక పత్రాలు అందజేశారు. ఎరుకల జాతి చైతన్యం కోసం, సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. ఎరుకల ప్రజల అభ్యున్నతికి కోసం నిరంతరం ఉద్యమిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి సంపత్, రాష్ట్ర కన్వీనర్ మొగిలి శేఖర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉండాడి వెంకటేష్, కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లొకిని బిక్షపతి, మహిళా సమితి నాయకులు, భూపాలపల్లి మండల నాయకులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, భూపాలపల్లి
