- ఓటర్ల కంటే పోలీసులే ఎక్కువ..
OCC Elections: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికలు శుక్రవారం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. బెల్లంపల్లి ఏసీపీ ఏ. రవికుమార్ నేతృత్వంలో మందమర్రి, తాండూర్ సీఐలు భారీగా సిబ్బందిని మోహరించారు. కార్మిక శాఖ నియమాల ప్రకారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఉదయం 8 గంటల వరకు కేవలం 18 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

తదుపరి అరగంటలో మొత్తం 25 ఓట్లు నమోదయ్యాయి. తొమ్మిది గంటల ప్రాంతంలో తరాజు గుర్తు అభ్యర్థి సత్యపాల్ రావు వర్గీయులు మూడు బస్సుల్లో వచ్చి చేరగా, పెద్దపులి గుర్తు అభ్యర్థి విక్రం రావు అనుచరులు వారిని గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు జోక్యం చేసుకొని కార్మికులను లోపలికి అనుమతించారు.
దీంతో పోలింగ్ ఒక్కసారిగా ఊపందుకుంది. మధ్యాహ్నం 1.30 గంట వరకు 265 పోలింగ్ అయినట్టు అధికారులు తెలిపారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభ మైంది.

ఓటర్ల కంటే పోలీసులే ఎక్కువ..
కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో శుక్రవారం మొత్తం 266 ఓట్లకు గాను 257 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీల్డ్ కవర్ ద్వారా 9 ఓట్లు నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 800 మంది పోలీసులను బందోబస్తుకు నియమించడం విశేషం.
బెల్లంపల్లి సబ్‌డివిజన్ పరిధిలోని పోలీసులతో పాటు రామగుండం కమిషనరేట్ నుంచి కూడా సిబ్బందిని మోహరించారు. కార్మికుల సంఖ్యకు మించి పోలీసులు బందోబస్తు నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
సత్యపాల్ రావు విజయం

– శెనార్తి మీడియా, మంచిర్యాల
