OCC Elections winner
OCC Elections winner

OCC RESULT : ఓరియంట్ సిమెంట్ ఎన్నికల్లో ఎస్పిఆర్ ఘన విజయం

OCC RESULT : మంచిర్యాల జిల్లా కాసిపేట్ మండలంలోని దేవాపూర్ ఓరియంట్ (అదానీ) సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో కొక్కిరాల సత్యపాల్ రావు (SPR)

oplus_2

ఘన విజయం సాధించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సోదరుడైన సత్యపాల్ రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, లేబర్-మైనింగ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు బలపరిచిన అభ్యర్థి పుస్కూరి విక్రమ్ రావుపై 33 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

 

మంత్రి సహా ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా, సునాయాస విజయం సాధిస్తామనుకున్న అభ్యర్థి ఆశలు విఫలమయ్యాయి. ఈ ఫలితంతో మంత్రి వివేక్ వర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం మధ్య జరిగిన పోటీలో ప్రేమ్ సాగర్ రావు పైచేయి సాధించారు. ఈ సందర్బంగా కార్యకర్తలు, మహిళలు భారీ ర్యాలీ, బాణాసంచా  కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *