Open Sitting:కూర్చునేందుకు కాస్తంత చోటుంటే చాలు.. ఎంచక్కా రెండు పెగ్గులేసి పోదామనే స్థితిలో ఉన్నారు శంకరపట్నం మండలంలోని కొందరు మద్యం ప్రియులు. అధికారుల పర్యవేక్షణ లోపం.. మందు బాబులకు మరింత కలిసి వస్తుంది. ఓ పక్క తహసీల్దార్ కార్యాలయం, మరో పక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇంకో వైపు మండల పరిషత్ కార్యాలయం, మరో వైపు మోడల్ స్కూల్, కేజీబీవీ. వీటన్నంటి మధ్య ఉన్న ట్యాంకు కింద బుధవారం మధ్యాహ్నం పట్టపగలే సిట్టింగ్ వేశారు మందుబాబులు.
చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, మరో వైపు విద్యా సంస్థలు ఉన్నాయనే సోయి కూడా లేకుండా మద్యం ప్రియులు దర్జాగా మందేసి వెళ్లిపోయారు. ఆయా కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వీరిని పట్టించుకోకపోవడం. గమనార్హం. మత్తులో మద్యం బాబుల గోలతో ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దృష్టి సారించి ఓపెన్ సిట్టింగ్లను నియంత్రించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
– శెనార్తి మీడియా, శంకరపట్నం
