Veternary Camp
పశు వైద్య శిబిరంలో పాల్గొన్న అధికారులు, రైతులు

Veternary Camp: రైతు కాలనీలో పశువైద్య శిబిరం

Veternary Camp: జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీలోని రైతు కాలనీలో బుధవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. 39 బర్రెలు, 2 ఆవులకు గర్భకోశవ్యాధి నివారణ చికిత్సల చేశారు. కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన 23 దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు మాట్లడారు. పశు వైద్యశిబిరాలను పాడి రైతులు వినియోగించుకోవాలని కోరారు. పశువుల్లో కృత్రిమ గర్భధారణ ప్రక్రియను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాని సూచించారు.

కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ బొద్దున సంధ్యారాణి-రామ్మూర్తి, మంచిర్యాల మండల పశువైద్యాధికారి శంకర్ లింగం, మందమర్రి వెటర్నరీ డాక్టర్ తిరుపతి , నస్పూర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ తిరుపతి, గోపాలమిత్ర జిల్లా సూపర్ వైజర్ ఏ రవి, గోపాలమిత్ర వేణుగోపాల్, శ్రీనివాస్, చెన్నయ్య పాడిరైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *