TB Control Officer: ఆదిలాబాద్ జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుమలత ఇటీవల ట్యూబర్క్యూ లోసిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అవార్డును దక్కించుకున్నారు.ఈ మేరకు తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం నాయకులు,రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్,డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ లో రిమ్స్ లో ఆమెను ఘనంగా శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు ఆమె సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ,మెడికల్ ఆఫీసర్ సాయి ప్రియ, రఘురాం, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా,ఆదిలాబాద్
