DONOOR
సర్పంచ్, ఉప సర్పంచ్ లను అభినందిస్తున్న గ్రామస్తులు

G.P. ELECTIONS : నాటకీయ పరిణామాల మధ్య ఉప సర్పంచ్ ఎన్నిక

G.P. ELECTIONS : జగిత్యాల జిల్లాలో మూడవ విడత జరిగిన ధర్మపురి నియోజక వర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ధర్మపురి మండలం దోనూర్ (DONOOR) గ్రామ సర్పంచ్ (SARPANCH) గా దాసరి పురుషోత్తం (CONGRESS) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పది వార్డులలో ఏడవ వార్డు బుద్దుల మల్లేష్ (CONGRESS) సైతం ఏకగ్రీవమయ్యారు. మిగిలిన తొమ్మిది వార్డులకు బుధ వారం ఎన్నికలు జరిగాయి. ఒకటవ వార్డు కాండెల రవి (CONGRESS), రెండవ వార్డు సభ్యుడిగా చిరుత మల్లేష్ (B.R.S.), మూడవ వార్డు సభ్యుడిగా మారంపెల్లి గంగయ్య (B.R.S.), నాలుగవ వార్డు గొట్టం ప్రణయ్ కుమార్ (CONGRESS), ఐదవ వార్డు ముత్యం సంతోష్ మమత (CONGRESS), ఆరవ వార్డు కళ్యాడపు శంకరయ్య (CONGRESS), ఎనిమిదవ వార్డు సభ్యుడిగా చిరుత ప్రభాకర్ (B.R.S.), తొమ్మిదవ వార్డు కుమ్మరి ఆశన్న (B.R.S.), పదవ వార్డు సభ్యుడిగా రామడుగు జగన్ (CONGRESS REBEL)లు ఎన్నికయ్యారు.

  • ఉప సర్పంచ్ గా ప్రభాకర్

వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ను ఎన్నుకున్నారు. పది వార్డులకుగాను ఐదుగురు కాంగ్రెస్ (CONGRESS) బలపర్చిన సభ్యులుండగా, నలుగురు బీఆర్ఎస్ (B.R.S.) బలపర్చిన సభ్యులుండగా ఒకరు CONGRESS REBEL సభ్యుడున్నారు. సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే కావడంతో ఉప సర్పంచ్ సైతం కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని వరిస్తుందని అందరు ఊహించారు. తీరా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ (CONGRESS) పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ (B.R.S.) సభ్యుడుకి మద్ధతు పలుకడంతో నాటకీయ పరిణామాల మధ్య ఉప సర్పంచ్ పదవి చిరుత ప్రభాకర్ (B.R.S.) ని వరించింది.

– శెనార్తీ మీడియా, ధర్మపురి :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *