పంచముఖ హనుమాన్, వెంకటేశ్వర స్వామి ఆలయాల సందర్శన
Mukkoti Ekadashi : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ శుక్రవారం పలు ఆలయాలను దర్శించుకొని పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పంచముఖ హనుమాన్, వేంకటేశ్వర స్వామి ఆలయాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్ ఇతర పోలీస్ అధికారులు దర్శించారు. పూజారులు అనంత ఆచార్యులు, డింగరి కృష్ణకాంత్ చార్యులు, నరసింహ శాస్త్రి చార్యులు మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు .అనంతరం సీపీ, డీసీపీలను ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ… రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. భక్తుల ఎలాంటి ఇబ్బంది లేకుండా దైవ దర్శనానికి అన్ని ఆలయాల్లో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు అందరూ ప్రశాంతంగా క్యూ పాటిస్తూ దైవ దర్శనం చేసుకోవాలని కోరారు. ప్రజలంతా ప్రశాంతంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, స్థానికులు ఉన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల