Urea line
Urea line : గద్దపాక సింగిల్ వింగో గోదాం వద్ద పెద్ద సంఖ్యలో మహళల క్యూ

Urea Line: గద్దపాకలో ఉదయం నుంచే బారులు

Urea Line: రోజులు గడుస్తున్నా యూరియా కొరత తప్పడం లేదు. రైతులు నిత్యం సింగిల్ విండో గోదాములు, సహకారం సంఘం కార్యాలయాల వద్ద పొద్దూమాపు పడిగాపులు కాస్తున్నారు. లైన్లో నిల్చోలేక పాసుబుక్కులు, చెప్పులు క్యూలో పెడుతున్నారు. కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.

Urea line
Urea line : గద్దపాక సింగిల్ వింగో గోదాం వద్ద పెద్ద సంఖ్యలో రైతుల క్యూ

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గడ్డపాక సొసైటీ వద్ద శనివారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు బారులు తీరి కనిపించారు.
సొసైటీకి 340 బస్తాలు రాగా, రైతుకు రెండు చొప్పున బస్తాలు పంపిణీ చేశారు. అక్కడ ఉన్న రైతులకు సరిపడా యూరియా బస్తాలు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.

– శెనార్తి మీడియా, శంకరపట్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *