Bandi and KTR: సిరిసిల్లా జిల్లాలో వరద ప్రాంతాల పరిశీలనలో అరుదైన క్షణం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై మరొకరు కఠిన వ్యాఖ్యలు చేసే బండి సంజయ్, కేటీఆర్ ఒకే వేదికపై కలిసారు.
గంభీరావుపేట మండలంలో ఎగువ మానేరు జలాశయానికి సమీపంగా చిక్కుకుపోయిన రైతులను హెలికాప్టర్ సాయంతో రక్షించారు. రక్షితులను పరామర్శించేందుకు బండి సంజయ్ అక్కడ ఉన్నారు. అదే సమయంలో కేటీఆర్ కూడా అప్పర్ మానేరు వద్దకు చేరుకోవడంతో ఇద్దరు నేతలు ముఖాముఖి అయ్యారు.
ఈ సందర్భంగా పరస్పరం చేతులు కలుపుకుని పలకరించుకున్నారు. కాసేపు నవ్వులు పంచుకున్నారు. అక్కడి ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. తమ తమ అభిమాన నేతల పేర్లు నినదిస్తూ కార్యకర్తలు సందడి చేశారు.

ఈ దృశ్యం వీడియో రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “వరదే కలిపిన రాజకీయ ప్రత్యర్థులు” అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
