NEET SEATS : మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ విద్యార్థికి నీట్ 2025 ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించి కౌన్సిలింగ్ లో ఉస్మానియా మెడికల్ కాలేజీ (OU MEDICAL COLLEG) లో సీటు సాదించింది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్ (DRIVER) గా పని చేస్తున్న పారుపల్లి రాజు (RAJU) కూతురు పారుపల్లి ఐశ్వర్యరాజ్ (AISHWARYA RAJ) పదో తరగతి వరకు ఆక్స్ ఫర్డ్ పాఠశాల (OXFORD SCHOOL) లో చదివి ఇంటర్ హైదరాబాద్ లోని శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల (SRI VASISTA JUNIOR COLLEGE) లో చదివి డైరెక్ట్ ఇంటర్ మీడియాట్ తోనే నీట్ (NEET) లో అత్యున్నతమైన మార్కులు సాధించింది. మొదటి ప్రయత్నంలోనే నీట్ లో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఐశ్వర్యరాజ్ ని బుధ వారం శ్రీ వశిష్ట కళాశాల ఏజీఎం (AGM) మీస వేణుమాధవ్ (MEESA VENU MADHAV) , డీజీఎం (DGM) కిరణ్ ప్రసాద్ (KIRAN PRASADH), శంకర్ (SHANKAR) లు ప్రశంసా పత్రం అందజేసి ప్రత్యేకంగా కలిసి అభినందించారు.

- గోదావరిఖని విద్యార్థినీకి…
గోదావరి ఖని మార్కండేయ కాలనీకి చెందిన మీనేష్ (MEENESH) కూతురు మౌనిక మొదటి ప్రయత్నంలోనే నీట్ లో మెడికల్ సీటు (MEDICAL SEAT) సాధించింది. హైదరాబాద్ శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన మౌనిక (MOUNIKA) ఎలాంటి లాంగ్ టర్మ్ కోచింగ్ లేకుండానే అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి ప్రయత్నంలోనే సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. మౌనికను కళాశాల జోనల్ డైరెక్టర్ మీస వేణుమాధవ్ (MEESA VENU MADHAV), రీజనల్ ఇంచార్జ్ కిరణ్ కుమార్ (KIRAN PRASADH), గోదావరిఖని ఇంఛార్జీ శంకర్ (SHANKAR) లు అభినందించారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల / గోదావరిఖని :
