MLC Kavitha : బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, అధికారులు సంప్రదాయబద్ధంగా ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయ దర్శన సమయంలో ఎమ్మెల్సీ కవిత శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు రాజ్యసభ సభ్యుడు వడ్డిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు టాటా మధు, మాజీ ఎమ్మెల్యేలు రెగా కాంతారావు, హరిప్రియ, చంద్రావతి కూడా ఉన్నారు.
అనంతరం శ్రీ లక్ష్మి తాయారమ్మ ఆలయంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్శనకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చేకూరింది.
-శెనార్తి మీడియా, భద్రాచలం
