Rice Millers Party: మంచిర్యాల జిల్లా రైతులు తాము పండించిన వరి ధాన్యం తూకం వేయించడానికి వారం రోజులుగా మిల్లుల గుమ్మం వద్ద ఎదురుచూస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం మిల్లర్ల విందుల్లో మునిగి వారి కష్టాలను మరిచిపోయారు.
వేంపల్లి శివారులో మిల్లర్ల అసోసియేషన్ ఉన్నతాధికారి నుంచి శాఖా సిబ్బంది వరకు సిట్టింగ్ సెట్ చేసింది. ఇంకేముంది ఇలా పిలుపు రాగానే అలా వెళ్లి సిట్టింగ్‌లో కూర్చున్నారు. అయితే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి మాత్రం వారి కంటికి కనిపించడం లేదు. మిల్లర్ల విందులో మునిగి తేలుతుండడంతో రైతుల కష్టాలను లెక్కలోకి తీసుకోవడం లేదు.
అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నా, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వెంటనే తూకం వేయమని రైతులు రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు మాత్రం వారి నిస్సహాయతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఈ విషయం ఆనోట.. ఈనోట బయటికి పొక్కడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా మిల్లర్ల పక్షానే ఉంటే, రైతులు ఎలాగైనా మట్టిలో కలవాల్సిందేనా?” అంటూ మండిపడుతున్నారు. వారు, “మిల్లర్ల కనుసన్నల్లో నడుచుకుంటారా? లేక రైతులకు న్యాయం చేస్తారా?” అని ప్రశ్నిస్తున్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల