- ప్రమాద స్థలానికి చేరుకున్న సింగరేణి సీఎండీ బలరామ్
SINGARENI RESCUE : ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదం జరిగినప్పటి నుంచి సింగరేణి (SINGARENI) రెస్క్యూ బృందం (RESCUE TEAM) సహాయక చర్యల్లో నిమగ్నమైంది. భూగర్భం(UNDER GROUND)లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేయగల సుశిక్షిత సిబ్బందిని రంగంలోకి దింపిన సింగరేణి (SINGARENI) సంస్థ, అత్యాధునిక పరికరాల సహాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రస్తుతం 100 మందికి పైగా సింగరేణి సిబ్బంది రాష్ట్ర, కేంద్ర సహాయక బృందా(TEAM)లతో సమన్వయం చేసుకుంటూ నిరంతరాయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ ప్రమాద ఘటన నేపథ్యంలో సింగరేణి సంస్థ సీఎండీ (CMD) ఎన్.బలరామ్ నాయక్ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించి, సహాయ చర్యలు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో నిబద్ధతతో పనిచేస్తున్న సింగరేణి రెస్క్యూ బృందాన్ని సీఎండీ (CMD) అభినందించారు.

సహాయక చర్యల్లో సింగరేణి రెస్క్యూ బృందం
సొరంగంలో చిక్కుకున్నవారు క్షేమంగా బయటకు రావాలి – సీఎండీ ఎన్.బలరామ్ నాయక్
సొరంగంలో చిక్కుకున్నవారి క్షేమసాధన కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. సహాయ కార్యక్రమాలు వేగంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తున్నాం. సింగరేణి (SCCL) సంస్థ తరఫున అన్నిరకాల సహాయ చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ నిరంతరం సహాయ కార్యక్రమాల్లో రెస్య్కూ సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అవసరమైతే మరో 200 మంది రెస్క్యూ (RESCUE) సిబ్బందిని పంపేందుకు సిద్ధంగా ఉన్నాం.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :
