DIL RAJU VS ANIL RAVIPUDI: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో అత్యధిక చిత్రాలు చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ దర్శకనిర్మాతల కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ గానే నిలిచింది. అటు దర్శకుడిగా అనిల్ రావిపూడిగా సక్సెస్ అవడంతో పాటు నిర్మాతగా దిల్ రాజుకు లాభాల పంట పండింది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు సంక్రాంతి కి వస్తున్నాం సక్సెస్ మీట్ లో స్వయంగా చెప్పాడు. తాము పడిపోతున్న ప్రతీసారి అనిల్ మాకో హిట్టిచ్చి నిలబెడుతున్నాడని వేదికపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇక దర్శకుల్లో రాజమౌళి తర్వాత అపజయమెరుగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి నిలిచాడు.
అనిల్ రావిపూడి తన తొలి చిత్రం పటాస్ నుంచి మొన్న సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం వరకు ప్రతీ సినిమా సూపర్ హిట్ గానే నిలిచింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రంతో ఏకంగా రూ.300 కోట్లు కొల్లగొట్టి రీజినల్ లాంగ్వేజ్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు అనిల్ రావిపూడి. ఈ ఒక్క సినిమా ముగ్గురికి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
కేవలం ఒక్క భాషలోనే విడుదలపై రూ. 300 కోట్లు వసూలు చేయడం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త రికార్డు. సూపర్ స్టార రజినీకాంత్, తమిళ స్టా్ర్ హీరో విజయ్, సూర్య లాంటి హీరోల సినిమాల వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తున్నా వారి చిత్రాలు తెలుగు, కన్నడ, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం కేవలం తెలుగులో మాత్రమే విడుదలై వండర్స్ క్రియేట్ చేసింది. ఇలా హీరో విక్టరీ వెంకటేష్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి తమ కెరీర్ లోనే హయ్యెస్ట్ సక్సెస్ కొట్టారు.
ఇప్పటి దాకా మంచి బాండింగ్ తో వస్తున్న అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు(Dil Raju) పరస్పరం తలపడబోతున్నారు. అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. చిరంజీవిని తన స్టైల్ లో సరికొత్త గా చూపించబోయే ప్రయత్నం చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. అయితే కథ, సినిమా జోనర్ అనేది ఏమిటనేది బయటకు రాకున్నా యాక్షన్, ఎంటర్ టైనర్ గా ఉంటుందనేది మాత్రం మెగాస్టార్ సన్నిహితులు చెబుతున్నారు.
ఇక తెలుగులో ప్రతీ సంక్రాంతి ఓ సినిమాను కచ్చితంగా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తుంటాడు నిర్మాత దిల్ రాజు. 2026 సంక్రాంతికి కూడా ఓ సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ కిషోర్ తిరుమల ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు. అయితే ఈ సినిమాను కచ్చితంగా సంక్రాంతికి తీసుకువచ్చేందుకు దిల్ రాజు ఫిక్సయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అనిల్ రావిపూడి, మెగాస్టార్ కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా 2026 సంక్రాంతికి వస్తుందనే టాక్ వినిపిస్తున్నది.
సంక్రాంతికి ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నా దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) పొంగల్ రేసుకే ప్రాధాన్యమిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ అలా వైకుంఠ పురం మూవీ కూడా రిలీజైంది. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై రెండు పెద్ద సినిమాలు రిలీజై సూపర్ హిట్లుగా నిలిచాయి.
2026 సంక్రాంతికి కూడా అదే పోటీ కనిపిస్తుందా అంటే అవుననే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తు్న్నది. దిల్ రాజు, అనిల్ మధ్య మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. కానీ తమ సినిమాల విడుదల విషయంలో మాత్రం అటు నిర్మాత దిల్ రాజు, ఇటు దర్శకుడు అనిల్ రావిపూడి ఎక్కడా కాంప్రమైజ్ కారు. మరి 2026 సంక్రాంతికి వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందా. సయోధ్య కుదుర్చుకొని వారం, పది రోజులు అటు ఇటుగా డేట్లు ఏమైనా మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.