CPI New Committe: గన్నేరువరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కూన మల్లయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ మండల కార్యదర్శి కాంతాల అంజి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ గ్రామశాఖను ప్రకటించారు. గ్రామ కార్యదర్శిగా బోయిని మల్లయ్య, సహాయ కార్యదర్శులుగా బొమ్మకంటి ఆంజనేయులు, కూన మల్లయ్య, కోశాధికారిగా పబ్బతి సాగర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బొమ్మకంటి సదానందం, న్యాత కొమురయ్య, జాలి గోపయ్య ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి అంజి రెడ్డి మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త శ్రమించాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎర్ర జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటాలకు గుర్తుగా ఎర్ర జెండా నిలిచిందన్నారు. భవిష్యత్తులో జరిగే ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.
కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, కార్యకర్తలు కళ్లెం రవి, గూడూరి రాజయ్య, కడమంచి వెంకటేశం, బొమ్మకంటి మల్లేశం, బొమ్మకంటి రాజు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, గన్నేరువరం