జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు
JEE RESULTS: జేఈఈ – మెయిన్స్ – 2025 ఫలితాల్లో ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ విద్యార్థులు సరికొత్త ప్రభంజనం సృష్టించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలో ఎస్ ఆర్ విద్యార్థి వీ నాగ సిద్ధార్థ (250310222429) అఖిల భారత స్థాయిలో 5వ ర్యాంకు సాధించి జాతీయ స్థాయిలో రాష్ట్రం, కళాశాల ఖ్యాతిని నిలబెట్టారు. పటిల్ సాక్షి (250310755778) 48వ ర్యాంకు, ఎం. అరుణ్ (250310501839) 60వ ర్యాంకుతో మెరిశారు. అలాగే, ఎం. రవిచంద్ర రెడ్డి, వై. భరణి శంకర్, బదావత్ సురేష్ వరుసగా 65, 88, 98 ర్యాంకులతో జాతీయ స్థాయిలో ఎస్ ఆర్ కళాశాల కీర్తిని మరింత చాటారు.
మొత్తం 15 మంది విద్యార్థులు జేఈఈ (మెయిన్) – 2025లో ఓపెన్ కేటగిరీలో 509 లోపు ర్యాంకులు సాధించడం విశేషం.
ఈ సందర్భంగా విద్యా సంస్థ చైర్మన్ వరదా రెడ్డి మాట్లాడుతూ, “ఎస్ఆర్ విద్యా సంస్థ ప్రతిభకు ఈ ఫలితాలు మరోసారి నిదర్శనంగా నిలిచాయ న్నారు. అధ్యాపకుల సమర్ధత, విద్యార్థుల కృషి ఫలితంగా ఈ ఫలితాలు వచ్చాయని చెప్పారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తమ అధ్యాపక బృందం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
శెనార్తి మీడియా, వరంగల్/కరీంనగర్