మంత్రి రివ్యూ మీటింగ్ లో గుర్రు కొట్టిన ఎమ్మెల్సీ
MLC Slept in Meeting: రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, వంద మందికి పైగా అధికారులు వచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా సమస్యలపై చాలా సీరియస్ గా సమీక్ష నడుస్తున్నది మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో . కానీ ఇంత మంది పెద్ద సార్ల మధ్యన తాపీగా గుర్రు కొడుతున్న ఈ పెద్ద మనిషి ఎవరనుకుంటున్నరా? కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్- మెదక్ నియోజకవర్గాల్లోని పట్టభద్రుల ఉపాధ్యాయలు ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్సీ మల్క కొమురయ్య..
ఇలా ప్రజా ప్రజా సమస్యలపై సీరియస్ గా చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఎమ్మెల్సీ కూడా అంతే గాడంగా నిద్రలోకి జారుకున్నాడు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతుండగా వేదికపై ఉన్న మరో ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య ఇలా గాఢ నిద్రలోకి జారుకొని కెమెరాలకు చిక్కాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో తామేనా ఇతనికి ఓటేసి గెలిపించింది అని ఆ పట్టభద్రులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తాను సమీక్షా సమావేశంలో నిద్రపోయిన విషయం సోషల్ మీడియాలో వైరలవుతున్నట్లు ఈ ఎమ్మెల్సీ దృష్టికి వెళ్లిందో .. లేదో మరి? బీజేపీ పెద్దలు జరంతా మీరు కూడా ఈ దృశ్యాలను కూడా చూసి తరించండి. మీ పార్టీ ప్రజాప్రతినిధి నిర్వాకం అంటున్నారు నెటిజన్లు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
