Nasha Mukth Bharath
Nasha Mukth Bharath

Nasha Mukth Bharath: డ్రగ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత

  • రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
  • నషా ముక్త్ భారత్ అభియాన్–2025పై అవగాహన
  • మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ

Nasha Mukth Bharath: డ్రగ్స్ రహిత సమాజం మనందరి బాధ్యత రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్–2025లో భాగంగా మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా రామగుండం పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులు, సిబ్బందితో కలిసి ఈ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజం లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. మత్తు పదార్థాలు తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ అమలవుతున్నదని చెప్పారు. ఈ ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో విస్తృత స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.

రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సరఫరాపై ఎవరైనా పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసులు నమోదు చేసి, షీట్స్ ఓపెన్ చేసి, పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. నషా ముక్త్ భారత్-2025 డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో కీలకంగా నిలుస్తున్నదని చెప్పారు.

పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి కమిషనర్ మత్తు పదార్థాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరించి, మత్తు పదార్థాల వ్యసనం, అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించేందుకు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, యాంటీ నార్కోటిక్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ సతీష్, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బాబురావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు భీమేష్, శ్రీనివాస్, ఆర్‌ఐలు శ్రీనివాస్, వామనమూర్తి, సీపీఓ సూపరిండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సందీప్, సంధ్య, అలాగే వివిధ విభాగాల ఎస్ఐలు, ఆర్‌ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Nasha Mukth Bharath pledge
Nasha Mukth Bharath pledge

– శెనార్తి మీడియా, గోదావరిఖని/మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *