- కేజీబీవీ విద్యార్థినులకు గాయాలు
RATS Bite: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులను ఎలుకలు కరిచి గాయపరిచిన ఘటన కలకలం రేపింది. విద్యార్థినులు రాత్రి నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా ఎలుకలు రావడంతో దాదాపు పది మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేశారు. తర్వాత గాయపడ్డ విద్యార్థినులకు గోప్యంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించినట్లు సమాచారం.
– శెనార్తి మీడియా, శంకరపట్నం:
