birthday celebrations
birthday celebrations

Birthday celebrations: ఘనంగా రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు

Birthday celebrations: బెజ్జంకి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో రసమయి ఆట, పాట, మాటలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారని, ప్రజల్లో చైతన్యం నింపారని నాయకులు పేర్కొన్నారు. ధూమ్ ధామ్ సంస్థాపక అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో స్పూర్తిని రగిలించిన ఘనత ఆయనదని అన్నారు.  వేడుకలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, బెజ్జంకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *