Arkandla vagu
Arkandla vagu

Arkandla Vagu: పొంగిపోతున్న అర్కండ్ల వాగు.. రాకపోకలు నిలిపివేత

Arkandla Vagu: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అర్కండ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శంకరపట్నం–చల్లూరు–వీణవంక–మామిడాలపల్లి–గోదావరిఖని–మంచిర్యాలకు రాకపోకలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ దారిలో అర్కండ్ల వాగు ఉన్నది.

భారీ వర్షాలకు వాగు పొంగిపొర్లడంతో మండలంలోని పలు పంట పొలాలు నీటమునిగాయి. దీంతో ఈ దారి గుండా రాకపోకలను నిలిపివేసినట్ల కేశవపట్నం ఎస్ఐ  కట్కూరి శేఖర్ రెడ్డి తెలిపారు.  గురువారం ఉదయం వాగు వరద ఉదృతిని స్వయగా పరిశీలించారు.

ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఈ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

Petrol Bunk
Petrol Bunk

నీటమునిగిన వరి పొలం
మండలంలోని కొత్తగట్టు పరిధి గొల్లపల్లి శివారులోని భారత్ భారత్ పెట్రోల్ పంపు కట్టడంతో వెనకాల ఉన్న రెండు నుంచి నాలుగు ఎకరాల భూములు నీట మునిగిపోయాయి

varipolam
varipolam

– శెనార్తి మీడియా, శంకరపట్నం:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *