- చిన్నారులతో భోజనం చేసిన సీపీ
Annadanam: రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లోని వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్‌లతో కలిసి పాల్గొన్నారు. సీపీ స్వయంగా మంథని డివిజన్ హ్యాండ్ క్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ, బాలల సంరక్షణ ఆశ్రమం గోదావరిఖని పిల్లలకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.

ఇక్కడ గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ, ఏఓ శ్రీనివాస్, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, ఆర్ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, సీపీఓ తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల/ గోదావరిఖని
