Organ Donation
Organ Donation

Organ Donation: మరణంలోనూ మరో నలుగురికి ప్రాణదానం

  • బైక్ ప్రమాదంలో గాయపడి యువకుడి బ్రెయిన్‌డెడ్
  • పుట్టెడు దు:ఖంలోనూ అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు

Organ Donation: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన చిలివేరి రాజేష్ (38) ఈనెల 20న కరీంనగర్ లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రాజేష్‌ను హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కి తరలించారు. తలకు బలమైన గాయాల కారణంగా పరిస్థితి విషమించింది. వైద్యులు ఆయనను బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. అవయవ దానం ద్వారా మరో నలుగురికి ప్రాణదానం చేసినవారవుతారని వైద్యులు అవగాహన కల్పించారు. పుట్టెడు దు:ఖంలోనూ అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. మానవతా దృక్పథంతో ముందడుగు వేసిన ఈ నిర్ణయం పలువురి హృదయాలను కదిలించింది.
రాజేష్ కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు.

-శెనార్తి మీడియా, శంకరపట్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *