- మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
MLC Election:మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున జిల్లాలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంసీసీ నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల, 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ, 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. మార్చి 8 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా అనుసరించాలనని సూచించారు. ఉల్లంఘించినట్లయితే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల