- నస్పూర్ లో రాత్రి 10:30 దాటినా మద్యం విక్రయాలు
Liquor Sales : మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని ఏఎస్ఆర్ వైన్స్ నిర్దిష్ట సమయం దాటినా మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నది. నిత్యం నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు సాగుతున్న సంబంధిత అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. జాతీయ రహదారిని ఆనుకొని పక్కన ఉన్న నస్పూర్‌లోని ఏఎస్ అర్ వైన్స్ రాత్రి మంగళవారం 10:43 గంటల వరకు తీసి ఉన్నా అధికారులు మాత్రం అటు వైపు చూడడం లేదు.

రాత్రి 10:32 గంటలకు తర్వాత కూడా ఏకంగా రెండు షెటర్లు ఎత్తి మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. ఆ షాపు పక్కనే ఉన్న మరో మద్యం దుకాణం మాత్రం రాత్రి గంటలకు మూసి వేస్తున్నారు. కానీ ఈ ఏఎస్ఆర్ వైన్స్ మాత్రం నిర్దిష్ట సమయం దాటినా మద్యం విక్రయాలు సాగిస్తుండడం, సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడంపై స్థానికంగా జోరుగా చర్చ సాగుతున్నది.
-శెనార్తి మీడియా, మంచిర్యాల

