- తనకు మద్దతు తెలపాలని కోరిన మల్క కొమురయ్య
Malka Komuraiah: బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య(Malka Komuraiah) బుధవారం ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం(election campaign) నిర్వహించారు. మంచిర్యాల (Mancherial) జిల్లా పరిషత్ స్కూల్ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ చేస్తూ, తన ప్రచారాన్ని కొనసాగించారు. ఉపాధ్యాయులు కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య మాట్లాడారు.

ఉపాధ్యాయులకు చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదని చెప్పారు. పెండింగ్ డీఏలు, మరో పక్కన 317 జీవో, బదిలీలు ఇలా ఎన్నో సమస్యలు ఉననాయన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి తొత్తులుగా మారి, వారి సొంత పనులు చేసుకున్నారే తప్ప, ఉపాధ్యాయుల సమస్యలకుపరిష్కారం చూపలేదన్నారు. చాలా రకాల సమస్యలు బడ్జెట్‌తో కాకుండా నాన్ బడ్జెట్ తో కూడా పరిష్కారం చూపవచ్చని చెప్పారు. కానీ ప్రభుత్వం అందుకు చొరవ చూపడం లేదని విమర్శించారు. సమస్యకు ఒక సంఘం తయారవుతుందన్నారు. ఇన్ని సమస్యల మధ్యలో ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఉపాధ్యాయులకు సంబంధించి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉపాధ్యాయులు మోసం చేశాయన్నారు. ఈసారి బీజేపీ అవకాశం ఇవ్వాలని, బీసీ బిడ్డగా తతను అందరూ ఆదరిస్తున్నారన్నారు. రోజు రోజుకూ ఉపాధ్యాయ సంఘాలు బీసీ, ఎస్సీ సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఉపాధ్యాయుల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తులా ఆంజనేయులు, ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల