300 Wicktes Club : ఐసీసీ (ICC) ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఐదో మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ ఓపెనింగ్ ను టీమిండియా బౌలర్లు తీవ్రంగా కట్టడి చేశారు.
ఓపెనర్లు బాబర్ అజామ్, ఇమామ్-ఉల్-హక్ ఇన్నింగ్స్ ప్రారంభించగా, 10 ఓవర్లలోనే వారిని పెవిలియన్ కు పంపించారు. బాబర్ 23 పరుగులు చేయగా, ఇమామ్ 10 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ , సౌద్ షకీల్ వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షకీల్ హాఫ్ సెంచరీ చేశాడు. 33 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.
34వ ఓవర్లో రిజ్వాన్, షకీల్ భాగస్వామ్యాన్ని అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత సౌద్ షకీల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. షకీల్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. రిజ్వాన్- షకీల్ తర్వాత, పాకిస్తాన్ వికెట్లు వరుసగా పడిపోతూనే ఉన్నాయి. తయ్యబ్ తాహిర్‌ను అవుట్ చేయడం ద్వారా జడేజా పెవిలియన్ పంపించాడు.
కుల్దీప్ యాదవ్ ఘనత
ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 200 పరుగుల స్కోరు వద్ద సల్మాన్ ఆఘాను అవుట్ చేసి పాకిస్తాన్‌ను మరో దెబ్బ కొట్టాడు. ఈ వికెట్‌తో దీంతో కుల్దీప్ అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. 163వ మ్యాచ్‌లో 170వ ఇన్నింగ్స్‌లో కుల్దీప్ ఈ ఘనతను సాధించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 300 (300 Wicktes Club)వికెట్లు తీసిన నాలుగో భారతీయ బౌలర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ బౌలర్లలో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన జాబితాలో ఉన్న ఆర్ అశ్విన్(Ashwin), జస్ప్రీత్ బుమ్రా(Jasprith Bhurah)లను కుల్దీప్ యాదవ్ అధిగమించాడు.
అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 300 అంతర్జాతీయ వికెట్లు తీసిన భారత బౌలర్లు
- 146 – కపిల్ దేవ్
- 161 – మహమ్మద్ షమీ
- 169 – అనిల్ కుంబ్లే
- 170 – కుల్దీప్ యాదవ్
- 173 – రవిచంద్రన్ అశ్విన్
- 181 – జస్ప్రీత్ బుమ్రా
సల్మాన్ ఆఘా వికెట్ పడగొట్టిన తర్వాత పాకిస్తాన్ 41 పరుగులు మాత్రమే చేసింది. మొత్తం పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీయడంలో కుల్దీప్ విజయం సాధించాడు. 9 ఓవర్లలో 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో 302 వికెట్లు పడగొట్టాడు.