Mancherial Govt Hospital : మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో (GGH) పరిశుభ్రత, రోగుల అవస్థలపై రెండు రోజుల క్రితం ‘శెనార్తి మీడియా’ కథనం ప్రచురించింది. దవాఖాన ఎలా ఉన్నా, రోగుల పరిస్థితి ఎలా ఉన్నా మాకు అక్కర్లేదు.. మా జీతం మాకు వస్తే చాలు అన్న చందంగా మారింది ఇక్కడి వైద్యులు, సిబ్బంది తీరు.
దవాఖానకు వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ధ్యాస ఉన్నతాధికారుల్లో లేనట్లు స్పష్టమవుతున్నది. కనీసం బెడ్ షీట్లు సమకూర్చలేని ఈ దవాఖానలో వైద్యం ఇంకెలా ఉంటుందోనని రోగులు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రైవేట్ లో వైద్యం చేయించుకోలేని పేదలు ఈ సర్కారు దవాఖానకు వచ్చి మరింత అవస్థల పాలవుతున్నారు. తాము అనారోగ్య సమస్యలతో ఇక్కడి వస్తే… ఆ సమస్య మరింత ముదిరేలా ఉందని ఇక్కడి రోగులు రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే బెడ్ షీట్లుు ఎన్ని.. ఇక్కడ వాడుతన్నవి ఎన్ని..?
మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు వెళ్లే రోగులు(Patients) వెంట బెడ్ షీట్లు తీసుకెళ్లక తప్పేలా లేదు. వార్డుల పర్యవేక్షణ బాధ్యతలో ఉన్న హెడ్ నర్సులు అడ్మిట్ అయిన పేషంట్లకు బెడ్ షీట్లు సమకూర్చడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. అసలు ఈ దవాఖానకు కేటాయిస్తున్న బెడ్ షీట్లు ఎన్ని.. ఉపయోగిస్తున్న బెడ్ షీట్లు ఎన్ని లెక్కలు తీస్తే సమాధానం మాత్రం రావడం లేదు. అసలు ఈ దవాఖానలో బెడ్ షీట్లు(Bed Sheets) ఉన్నాయా.. లేవా ?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా ఉన్నతాధికారులు స్పందించేదెన్నడో..?
జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన పరిస్థితిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరముందని ఎంతైనా ఉంది. చికిత్స పొందుతున్న వారికి కనీసం బెడ్ షీట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో దవాఖాన తీరు ఉన్నదా అని పేషంట్ల బంధువులు, వారి సహాయకులు ప్రశ్నిస్తున్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల