CMD
మాట్లాడుతున్న సీఎండీ బలరాం నాయక్

SCCL CMD : సింగరేణి భవిష్యత్తు కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలి

  • సీఎండీ ఎన్.బలరామ్

SCCL CMD : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో అలసత్వం ప్రదర్శించే వారికి స్థానం ఉండదని, సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వారికే అవకాశముంటుందని, పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి అవసరమైన ప్రణాళికలను వచ్చే పదేళ్లకు సిద్ధం చేయాలని సీఎండీ(C&MD) ఎన్ బలరామ్ నాయక్ స్పష్టం చేశారు. సోమ వారం సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల జీఎం (GM) లు, 39 గనులకు సంబంధించిన ప్రాజెక్టు అధికారులు (PO), ఏజెంట్ల (AGENTS)తో తొలిసారిగా సింగరేణి భవన్‌లో ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా ఏరియాల లక్ష్యాల పురోగతిని సమీక్షించి, మిగిలిన లక్ష్యాలను 43 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా సాధించాల్సిందిగా సూచించారు. రోజుకు 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా నిర్ధేశించడంతో పాటు 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ (OB) తొలగించాలన్నారు.

రక్షణతో కూడిన ఉత్పత్తే లక్ష్యంగా…

భద్రత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తే లక్ష్యంగా బొగ్గు రవాణా సమర్థంగా నిర్వహించేందుకు రైల్వే, వినియోగదారులతో సమన్వయం కొనసాగించాలని సీఎండీ (C&MD) ఎన్ బలరామ్ నాయక్ సూచించారు. నూతన గనుల అభివృద్ధికి సంబంధించి భూ సేకరణ, పర్యావరణ అనుమతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత కార్పోరేట్ జీఎంలకు ఆదేశాలు ఇచ్చారు. కార్మికుల సంక్షేమం దృష్ట్యా మ్యాన్ రైడింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని సూచించారు.

ప్రతి ఉద్యోగి రోజుకు 8 గంటలు విధులు నిర్వర్తించాలి

ఉత్పాదకత పెంపునకు భూగర్భ గనులలో టబ్బుల అందుబాటును మెరుగుపరచడం, ప్రాసెస్డ్ ఓవర్ బర్డెన్ నిల్వల నిర్వహణ, గైర్హాజరీలు తగ్గించేందుకు కౌన్సిలింగ్ నిర్వహణ వంటి చర్యలు తీసుకోవాలని సీఎండీ (C&MD) ఎన్ బలరామ్ నాయక్ సూచించారు. ప్రతి ఉద్యోగి రోజుకు 8 గంటలు విధులు నిర్వర్తించాలని, మస్టర్ పడి బయటకు వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. విధులకు సమయానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్రేస్ టైమ్ మించి మస్టర్ నమోదు అనుమతించరాదని స్పష్టం చేశారు. ఉద్యోగులు, అధికారులు ప్రతిఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకుని సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.

CMD OFFICE
పాల్గొన్న డైరెక్టర్లు

ఈ సమావేశంలో డైరెక్టర్లు డి సత్యనారాయణ (E&M), ఎల్ వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె వేంకటేశ్వర్లు (P&P), అడ్వైజర్ (ఫారెస్ట్రీ) మోహన్ పర్గేన్, జీఎం (కో ఆర్డినేషన్) ఎస్.డీ.ఎం. సుభానీ, జీఎం (CPP) మనోహర్, జీఎం (మార్కెటింగ్) డి రవి ప్రసాద్, అన్ని ఏరియాల జీఎం (GM)లు, ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *