CP VISITERS
బాధితురాలితో మాట్లాడుతున్న సీపీ శ్రీనివాస్

RAMAGUNDAM CP : నేరుగా ఫిర్యాదుదారుల వద్దకు వచ్చి…

  • స్వయంగా సమస్యలు తెలుసుకొని…
  • సంబంధిత అధికారులతో మాట్లాడి…
  • సత్వర న్యాయం అందించిన సీపీ శ్రీనివాస్

RAMAGUNDAM CP : రామగుండం పోలీస్ కమీషనర్ (CP) ఎం. శ్రీనివాస్ ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు… ఇందులో భాగంగా సోమవారం రామగుండం పోలీస్ కమీషనరేట్ ప్రధాన కార్యాలయంలో నేరుగా ఫిర్యాదుదారుల వద్దకు వచ్చి.. వారి సమస్యలను స్వయంగా తెలుసుకొని.. వారి ముందే సంబంధిత పోలీస్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడి వారి సమస్య పరిష్కారానికి కృషి చేసి సత్వర న్యాయం అందించారు… న్యాయం కోసం నమ్ముకొని వచ్చిన అర్జీదారులకు మేము అండగా ఉన్నామంటూ మనోధైర్యాన్ని అందించారు…

CP VISITER
ఫిర్యాదును చదువుతున్న సీపీ శ్రీనివాస్

రామగుండం సీపీ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్ (ZONE) ల పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి సీపీ శ్రీనివాసు దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. సమస్య తెలుసుకొని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌ల ఎస్ హెచ్ ఓ(SHO)లకు, ఎస్ఐ(SI)లకు, సిఐ()CIలకు ఫోన్ ద్వారా సమస్య పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చి తగిన సలహాలు, సూచనలు అందించారు. ప్రజలు పోలీసులకు భయపడకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రామగుండం కమీషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడడం, ప్రజలకు న్యాయపరమైన సేవలను అందించడం తమ ప్రధాన లక్ష్యమని సీపీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *