పనులను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
పనులను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

MEDICAL COLLEGE VISIT : జిల్లాకు మెడికల్ కళాశాల – కేసీఆర్ శ్రమకు ఫలితం

  • మెడికల్ కళాశాల పనుల్లో వేగం – పరిశీలనలో  మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

MEDICAL COLLEGE VISIT : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల పనులను బీఆర్ఎస్ పార్టీ నేతలు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఈ మెడికల్ కాలేజ్ మంజూరు అయినట్లు గుర్తు చేశారు.

బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే తో నాయకులు, కార్యకర్తలు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తో నాయకులు, కార్యకర్తలు

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వాటిలో భాగంగానే మంచిర్యాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైందని, ఇది కేసీఆర్ శ్రమకు నిదర్శనమని పేర్కొన్నారు. నిర్మాణ పనులు తూర్పరగా పూర్తి చేసి కళాశాల ద్వారా జిల్లావాసులకు వైద్య విద్యతో పాటు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా చూడనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *